Horoscope Today(18/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే.

Update: 2023-04-17 23:30 GMT

Horoscope Today: నేటి రాశి ఫలాలు..

Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే. మీరు క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఆ రోజు మీ నక్షత్రాలు, రాశులు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండనున్నాయి. శ్రీనివాస కుమార శర్మ అందించే నేటి రాశి ఫలాల వివరాలు..

18_04-2023 (మంగళవారం), సూర్యోదయం: 6:00 AM TO సూర్యాస్తమయం: 6:30 PM, స్వస్తిశ్రీ శోభకృత్ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్రమాసం, మంగళవారం, తిథి కృష్ణ త్రయోదశి 01:28 PM తదుపరి కృష్ణ చతుర్థశి, నక్షత్రము: ఉత్తరాబాధ్ర 01:02 AM వరకు తదుపరి రేవతి, చంద్రరాశి: మీనరాశి 17-04-2023, 20:52:55 నుంచి 19-04-2023, 23:54:11 వరకు, వర్జ్యం ఈ రోజు 11:30 AM నుంచి 01:00 PM వరకు, దుర్ముహూర్తం: 08:30 AM TO 09:20 AM, 11:06 PM TO 11:52 PM, రాహుకాలం: 03:23 PM TO 04:56 PM, అమృత ఘడియలు: 08:31 PM TO 10:01 PM వరకు.

మేష రాశి: ధన లాభము, సుఖసంపద, యత్నకార్యసిద్ధి మొదలగు శుభాలున్నాయి. మిత సంభాషణ ఎంతో మేలు కలుగజేస్తుంది.

వృషభరాశి: అన్ని రంగాలలోనూ జయప్రదం, ఉద్యోగప్రాప్తి, అభివృద్ధి పురోగతి, వస్తు సేకరణ పలుకుబడి పెరగడానికి అవకాశం ఉంది.

మిధున రాశి: మానసిక ఆందోళన, గృహ బాధ్యతలు అధికం కావడం, అధిక ధనవ్యయం, ఉద్యోగాల్లో కొంత ప్రోత్సాహం, అదనపు సౌకర్యాల లోపం ఉండదు.

కర్కాటక రాశి: వ్యయం, దుబారా ఖర్చు, శ్రమతో పనులగుట, జాగ్రత్త అవసరం, పెద్దల పరిచయాలు, ప్రయాణాలు సంభవిస్తాయి.

సింహరాశి: అన్ని రంగాలలోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. ధనలాభం, సుఖం, రావాల్సిన బాకీలు వసూలు అగుట, పనులు చురుకుగా సాగుతాయి.

కన్యా రాశి: పెద్దల సుముఖత లభిస్తుంది. శుభకార్యాలకు ఖర్చు, సారస్వత, వైజ్ఞానిక, వ్యవసాయ, వ్యాపార వృత్తులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

తులారాశి: సంతాన విషయంలో ఆలోచనలు శుభఫలితములను ఇచ్చును. కొంత కార్య అనుకూలత ఏర్పడును. వ్యాపార, వృత్తి విషయములలో కొంత పురోభివృద్ధి కనబడును.

వృశ్చిక రాశి: బార్యాభర్తల మధ్య విభేదములు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు నూతన అవకాశములకై ప్రయత్నాలు చేస్తారు. ధనము ఖర్చు పెరిగినప్పటికీ అది శుభముగానే ఉంటుంది.

ధనుస్సు రాశి: వస్తు వాహన ప్రాప్తి, ధనవ్యయం, కొద్దిపాటి చికాకులు, శుభకార్యసిద్ధి, వ్యతిరేకుల వల్ల కొంత ఇబ్బంది, కుటుంబ పరిస్థితుల్లో కొద్దిపాటి మార్పు సూచిస్తుంది.

మకరరాశి: దైవపరమైన యాత్రలు, ధనలాభం, ఆదాయం పెరుగుట, చిక్కులు తొలిగి శుభము చేకూరుట, కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.

కుంభరాశి: రాజదర్శనము, మిత్రులతో సంభాషణచే సత్ఫలితాలు, కళత్ర సుఖము, కుటుంబంలో సంతానం యొక్క వివాహ ప్రయత్నాములు ఫలించుట.

మీనరాశి: శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి చెందును, శుభకార్యక్రమ ప్రయత్నాలు సఫలమవుతాయి. బుణ ప్రయత్నాములు సిద్ధించు అవకాశం ఉన్నది.


SRINIVASA KUMARA SARMA

ASTROLOGER AND SPIRITUAL HEALER

6304796532

Tags:    

Similar News