Cow Dream Meaning: రాత్రిపూట కలలో ఆవును చూశారా.. నిజ జీవితంలో ఈ సంఘటనలు ఎదుర్కొంటారు..!

Cow Dream Meaning:ప్రతిరోజు మనం నిద్రపోయిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాం. అందులో పక్షులు, జంతువులు, సముద్రాలు, మనుషులు ఇలా ఎన్నోరకాల వాటిని చూస్తుం టాం. కొన్ని కలలో అర్ధరాత్రి వస్తే మరికొన్ని తెల్లవారుజామున వస్తుంటాయి.

Update: 2024-04-01 16:00 GMT

Cow Dream Meaning: రాత్రిపూట కలలో ఆవును చూశారా.. నిజ జీవితంలో ఈ సంఘటనలు ఎదుర్కొంటారు..!

Cow Dream Meaning: ప్రతిరోజు మనం నిద్రపోయిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాం. అందులో పక్షులు, జంతువులు, సముద్రాలు, మనుషులు ఇలా ఎన్నోరకాల వాటిని చూస్తుం టాం. కొన్ని కలలో అర్ధరాత్రి వస్తే మరికొన్ని తెల్లవారుజామున వస్తుంటాయి. ఏ కల అయినప్ప టికీ అది భవిష్యత్‌లో మనకు ఏదో ఒక సంకేతాన్ని సూచిస్తుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకి నిర్ధిష్టమైన అర్థం దాగుంటుంది. ఈ రోజు కలలో ఆవు కనిపిస్తే శుభమా, అశుభమా తెలుసుకుందాం.

హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం. అందుకే జంతువులలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం ఆవును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవును చూడటం మంచి సంకేతం. భవిష్యత్‌లో ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం. సమాజంలో కుటుంబ గౌరవం పెరుగుతుందని వ్యాపారంలో పురోగతి లభిస్తుందని చెబుతారు. కలలో ఆవు దూడను చూడడం కూడా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని అర్థం. మీరు ఏ పనిచేసినా అందులో విజయం సాధిస్తారని చెప్పవచ్చు.

కలలో ఆవుకి రొట్టెలు తినిపిస్తే చాలా మంచిది. ఈ కల మీకు దీర్ఘాయువును సూచిస్తుంది. చాలా కాలంగా మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది త్వరలోనే మెరుగుపడుతుందని అర్థం. కలలో ఆవుల మందను చూడటం అంటే త్వరలో మీకు చాలా డబ్బు లభిస్తుందని అర్థం. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుందని సూచిస్తుంది. త్వరలో మీరు ధనవంతులు అవుతారని చెప్పవచ్చు. ఒకవేళ కలలో మీరు ఆవు చనిపోయినట్లు చూస్తే మంచిది కాదు. భవిష్యత్‌లో కొంత నష్టాన్ని చూడబోతున్నారని అర్థం. కొత్త సమస్యలు రాబోతున్నట్లు సంకేతం.

Tags:    

Similar News