Vinayaka Chavithi 2023: గణపతి పూజలో ఇవి తప్పనిసరి.. లేదంటే పూజ అసంపూర్ణం..!
Vinayaka Chavithi 2023: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం చేసినా ముందుగా గణపతి పూజ చేస్తారు.
Vinayaka Chavithi 2023: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం చేసినా ముందుగా గణపతి పూజ చేస్తారు. ఎందుకంటే చేసే పనికి ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆయన కాపాడుతాడని నమ్మకం. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వస్తుంది. దీంతో అందరు విగ్రహాల కొనుగోళ్లు, మండపాల ఏర్పాట్లలో మునిగిపోయారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ హిందువులకి అత్యంత పవిత్రమైనది. గణేశుడు భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున జన్మించాడు. ఈ రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. అయితే గణపతి పూజలో కచ్చితంగా కొన్ని వస్తువులు ఉండాలి. లేదంటే పూజ అసంపూర్ణమని చెబుతారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దర్భ గడ్డి
వినాయకుడి పూజలో దర్భ గడ్డి కచ్చితంగా ఉండాలి. ఇదంటే ఆయనకి చాలా ప్రీతి. ఇది లేకుండా పూజ చేస్తే అది అసంపూర్ణం. కాబట్టి గణపతి పూజలో తప్పనిసరిగా దర్భగడ్డిని ఉపయోగించండి.
ఉండ్రాళ్లు, కుడుములు
గణపతికి ఉండ్రాళ్లు, కుడుములు అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటాడు. అందుకే మొదటి రోజు ఆయనకి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టాలి. వీటిని సమర్పించిన భక్తులకి అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి.
పువ్వులు
గణేశుని పూజలో పూలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొమ్మిది రోజులు రకరకాల పూలతో పూజించాలి. ముఖ్యంగా గణేశుడికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ సీజన్లో లభించే మందారం, గులాబీ పువ్వులు ఉపయోగించాలి. అలాగే పూజకి ముందు విగ్రహానికి సింధూర తిలకం దిద్దాలి. దీనివల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.
పండ్లు
వినాయకుడి పూజలో పండ్లు తప్పనిసరి. ముఖ్యంగా అరటి పండు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ సీజన్లో లభించే సీతాఫలం, యాపిల్స్, ఎలక్కాయ మొదలైనవి ఉండాలి. నైవేద్యంగా సేమియా పాయసం, పులిహోర, దద్దోజనం, శెనగలు మొదలైన వాటిని పెట్టవచ్చు.