Vinayaka Chavithi 2023: గణపతిని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి.. ముహూర్తం పూజ విధానం తెలుసుకోండి..!
Vinayaka Chavithi 2023: హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వస్తుంది.
Vinayaka Chavithi 2023: హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వస్తుంది. ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించి పదో రోజు ప్రవహించే నదిలో నిమజ్జనం చేస్తారు. ఇక ఈ 10 రోజులు నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున గణపతి జన్మిస్తాడు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 18వ తేదీతో పాటు 19 న కూడా వచ్చింది. దీంతో వినాయక చవితిని అందరు సెప్టెంబర్ 18న జరుపుకుంటున్నారు. అయితే గణేశుడిని ఏ ముహూర్తంలో ప్రతిష్ఠించాలి, పూజ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.
వినాయక చవితి ముహూర్తం
పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8.43 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, పూజ చేసుకోవచ్చు. గణేష్ పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. అనంతరం పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని వేయాలి. గణపతిని ముహర్తం చూసుకుని ఇంటికి తీసుకొచ్చి పీఠంపై ప్రతిష్ఠించాలి.
తర్వాత 10 రోజుల పాటు సంప్రదాయం, ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించాలి. 11వ రోజు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. ఇప్పటికే గల్లీ గల్లీలో వినాయక చవితి సందడి మొదలైంది. గణపతి విగ్రహాన్ని మండపాల్లో ఏర్పాటు చేయడానికి అందరు రెడీ అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు విభిన్నంగా నిర్వహిస్తారు.