Religion News: ఫాల్గుణం చివరి నెల.. ఈ మాసంలో ఇవి దానం చేస్తే వందరెట్ల ప్రతిఫలం..!

Religion News:హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసాన్ని ఏడాదిలో చివరి నెలగా పిలుస్తారు.

Update: 2024-03-13 01:30 GMT

Religion News: ఫాల్గుణం చివరి నెల.. ఈ మాసంలో ఇవి దానం చేస్తే వందరెట్ల ప్రతిఫలం..!

Religion News: హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసాన్ని ఏడాదిలో చివరి నెలగా పిలుస్తారు. ఈ మాసంలో చేయాల్సిన కొన్ని ప్రత్యేక పనులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో దానం చేయడం వల్ల వందరెట్లు ఫలితాలు వస్తాయని నమ్మకం. ఫాల్గుణ మాసం అత్యంత పవిత్రమైన మాసం. మహాశివరాత్రి, రంగుల పండుగ హోలీ వంటి అనేక పండుగలు ఈ నెలలో వస్తాయి. ఈ మాసంలో సరైన వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఫాల్గుణ మాసం హోలీ పండుగకు ప్రసిద్ధి. ఈ నెలలో రంగులకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ మాసంలో రంగులు దానం చేయడం శుభప్రదంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఫాల్గుణ మాసం శ్రీ కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ మాసంలో తమకు ఇష్టమైన నెమలి ఈకలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంటికి దూరంగా ఉంటుంది.

ఫాల్గుణ మాసం శివుడికి అంకితమైనది. నిజానికి మహాశివరాత్రి పండుగ ఈ మాసంలోనే జరుపుకుంటారు. అందువల్ల బిల్వ పత్రాలను దానం చేయడం శుభప్రదంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ మహాశివుడి అనుగ్రహం భక్తులపై ఎల్లవేళలా నిలిచి ఉంటుందని నమ్మకం ఫాల్గుణ మాసంలో వేణువును దానం చేయడం శుభప్రదంగా చెబుతారు. నిజానికి ఈ మాసం శ్రీ కృష్ణ భగవానుడికి ప్రత్యేకమైనది. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.

Tags:    

Similar News