Financial Crisis: కష్టపడి పనిచేసినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. మీకు తెలియకుండా ఈ తప్పులు చేస్తున్నారు..!
Financial Crisis: కొంతమంది జీవితంలో చాలా కష్టపడుతారు. కానీ అవసరానికి డబ్బులు దగ్గర ఉండవు.
Financial Crisis: కొంతమంది జీవితంలో చాలా కష్టపడుతారు. కానీ అవసరానికి డబ్బులు దగ్గర ఉండవు. ఇంట్లో ఒక్క పైసా నిలవదు. జ్యోతిష్యం ప్రకారం ఒక వ్యక్తి ఎంత కష్టపడినా డబ్బులు నిలవడం లేదంటే అతడు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నాడని అర్థం. వీటివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వారికి లభించదు. తరచుగా ఆమె ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో కొన్ని చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.
1. చాలా మంది భోజనం చేసిన తర్వాత ఖాళీ ప్లేట్‌ను డైనింగ్ టేబుల్‌పై పెడుతారు. చేయి కడుక్కోకుండా వేరే పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అనవసరమైన పని కోసం డబ్బు వృధా అవుతుంటుంది.
2. ఆహారం తిన్న తర్వాత పాత్రలను వెంటనే అక్కడ నుంచి తీసి సింక్ లో వేయాలి. తిన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
3. భోజనం చేసేటప్పుడు దక్షిణం లేదా నైరుతి ముఖంగా ఉన్నవారికి డబ్బు అనారోగ్యం కారణంగా ఖర్చవుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దిశలో ఆహారాన్ని తినడం మానుకోవాలి.
4. పచ్చళ్లంటే ఇష్టం ఉన్నవాళ్లు ప్లేట్‌లో ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. తినే ప్లేటులో పచ్చడి వదిలిపెడితే ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.
5. నెలవారీ జీతం వచ్చిన రోజు డబ్బు ఖర్చు చేయకూడదు. నగదు దొరికితే దేవుడి దగ్గర పెట్టాలి. ఖాతాలోకి డబ్బు వస్తే 24 గంటల పాటు అకౌంట్‌లో ఉంచాలి.
6. సంపాదనలో కొంత భాగాన్ని దేవుడికి అంకితం చేయాలి. మరికొంత భాగాన్ని దాన ధర్మాలకు వదిలివేయాలి. మిగతావి ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవాలి.
7. ఇంట్లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచాలి. సూర్యోదయం సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రపరచడం అలవాటు చేసుకోవాలి.