Vastu Tips: మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. పేదవారిగా మిగులుతారు..!
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల సంపద కలుగుతుంది. ఇందులో మనీ ప్లాంట్ ఒకటి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల సంపద కలుగుతుంది. ఇందులో మనీ ప్లాంట్ ఒకటి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఇది కనిపిస్తుంది. అయితే ఈ మొక్క నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ని ఏ విధంగా నాటాలో ఈ రోజు తెలుసుకుందాం.
వాస్తవానికి మనీ ప్లాంట్‌ను దొంగిలించి ఇంట్లో నాటకూడదు. ఈ తప్పు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్‌ని కొనుగోలు చేసి ఇంట్లో నాటితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మొక్క
సంపదకు దేవత అయిన లక్ష్మిదేవితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ మొక్క తీగలు ఎప్పుడూ నేలను తాకకూడదు. తాడు లేదా కర్ర సహాయంతో పైకి కట్టాలి. దీని తీగలు నేలకు తాకడం వల్ల లక్ష్మీ దేవిని అవమానించినట్లు అవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలి. దీని వల్ల ఇంట్లో ఆర్థిక లాభంతో పాటు ధన వృద్ధి జరుగుతుంది. అలాగే మనీ ప్లాంట్‌ను ఎప్పుడు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి ఆశీస్సులు వారికి వెళుతాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటి బయట ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంచాలి.