Vastu Tips: తరచుగా ఇంటి యజమాని అనారోగ్యానికి గురవుతున్నాడా.. ఈ దోషాలను సరిచేయండి..!

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి గోడ పగిలితే మంచిది కాదు. పేదరికం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఇంటి యజమాని ఆరోగ్యం క్షీణిస్తుంది.

Update: 2023-11-24 01:30 GMT

Vastu Tips: తరచుగా ఇంటి యజమాని అనారోగ్యానికి గురవుతున్నాడా.. ఈ దోషాలను సరిచేయండి..!

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి గోడ పగిలితే మంచిది కాదు. పేదరికం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఇంటి యజమాని ఆరోగ్యం క్షీణిస్తుంది. పగిలిన గోడ నైరుతి మూలలో ఉండకూడదు. ఇది రాహువు స్థానం. ఇక్కడ పూర్వీకుల స్థానం కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఇంటి పెద్ద లేదా భూమి ఎవరి పేరుపై ఉంటుందో వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటి యజమానికి బాగాలేకపోతే కచ్చితంగా ఒకసారి ఇంటి వాస్తును చెక్ చేయాలి. విరిగిన గోడ, కిటికీలను సరిచేయాలి.

భూమి మూలకం ఈ మూలలో నివసిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్ ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఇంటి యజమాని ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఇంటి ప్రశాంతతకు భంగం కలుగుతుంది. నైరుతి దిశలో ఆహారం తినడం కూడా మానుకోవాలి. ఇలాంటి సమయంలో మీకు ఇష్టమైన దేవుడిపై నమ్మకం ఉంచి ప్రార్థించాలి. పూజ గదిలో గంగాజలం ఉంచాలి. పూర్వీకుల పట్ల గౌరవంగా ఉండాలి. వారిని అస్సలు తిట్టకూడదు. ఇంట్లో వారి ఫోటోలను గౌరవించాలి.పెద్దలకు సేవ చేయాలి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండను క్రమం తప్పకుండా పఠించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తుకు సంబంధించిన దోషాలు తగ్గుతాయి.

Tags:    

Similar News