Diwali 2023: దీపావళికి ముందు కలలో ఇవి కనిపించాయా.. జీవితం మారిపోతుంది..!
Diwali 2023: హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు ఇంటిని అలంకరించి, కొత్త బట్టలు ధరించి, దీపాలతో ఇంటిని అలంకరిస్తారు.
Diwali 2023: హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు ఇంటిని అలంకరించి, కొత్త బట్టలు ధరించి, దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. తద్వారా ఇంట్లో ఆనందం, సంతోషం ఉంటుందని నమ్ముతారు. అయితే పండుగ ముందర కలలో ఈ వస్తువులు కనిపిస్తే అదృష్టం తలుపు తడుతుందని అర్థం. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకి నిజ జీవితానికి కొంత సంబంధం ఉంటుంది. ఈ పరిస్థితిలో, దీపావళికి ముందు కలలో ఈ వస్తువులు కనిపిస్తే అతని భవిష్యత్ మారబోతుందని అర్థం చేసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కలలో లక్ష్మీదేవి
దీపావళికి ముందు ఒక వ్యక్తి కలలో లక్ష్మీ దేవిని చూస్తే తల్లి ప్రత్యేక ఆశీర్వాదాలు అతనిపై ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంతే కాదు వ్యక్తి, అతని కుటుంబం అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వారు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు.
కలలో అమృత కలశం
ఒక వ్యక్తి కలలో సముద్ర మథనం సమయంలో వెలువడిన అమృతపు కుండను చూస్తే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోలుకుంటున్నాడని అర్థం. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా ఆ వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
గోధుమ పంట
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో గోధుమ లేదా వరి పంటను చూస్తే అది శుభప్రదం. డబ్బు సంపాదించే సూచన ఉందని అర్థం. అంతే కాకుండా అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి వచ్చి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.