Dream Science: కలలో గులాబి పువ్వు, చిలుకలు కనిపించాయా.. జీవితంలో వీటి సంకేతాలు ఏంటంటే..?
Dream Science: నిద్రపోయాక ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. కానీ ఇందులో కొన్ని నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
Dream Science: నిద్రపోయాక ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. కానీ ఇందులో కొన్ని నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిలో నిజం ఎంత అనేది తెలియదు కానీ స్వప్నశాస్త్రం మాత్రం ఇదే చెబుతుంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు కచ్చితంగా నిజం అవుతాయని చాలామంది నమ్మకం. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో వచ్చే కలల గురించి వివరించే ఒక గ్రంథం. ఇందులో ప్రతీ కలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అయితే కలలో గులాబి పువ్వు, చిలుకలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం.
కలలో గులాబీ పువ్వును చూడటం
డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో గులాబీ పువ్వు కనిపిస్తే చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. ఇది లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. త్వరలో మీ ఇంట్లో సంతోషకరమైన సంఘటన జరుగుతుంది లేదా మీ చిరకాల కల నెరవేరుతుందని అర్థం. అందరితో కలిసి ఆనందంగా వేడుకలు చేసుకునే సమయం వస్తుందని శాస్త్రం చెబుతోంది.
కలలో చిలుకను చూడటం
జ్యోతిషశాస్త్రంలో చిలుకను శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో చిలుకను చూసినట్లయితే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని అర్థం. ఇది జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో నింపుతుందని శాస్త్రం చెబుతోంది.
కలలో వర్షం చూడటం అంటే ఏమిటి?
కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే శుభ సంకేతాన్ని సూచిస్తుంది. అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. త్వరలో ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో పురోగతిని సాధిస్తారు. కలలో స్వచ్ఛమైన నీటిని చూస్తే అది మంచిగా చెబుతారు.
కలలో పండ్ల చెట్టు
వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి కలలో పండ్లతో నిండిన చెట్టును చూస్తే అతను వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందబోతున్నాడని అర్థం. ఆ వ్యక్తి చాలా సంతోషాన్ని, సంపదను పొందబోతున్నాడని అర్థం. అతడు చేపట్టిన వ్యాపారం విజయవంతం అవుతుంది.