Coconut Spoiled: పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందా.. సంకేతం ఏంటంటే..?
Coconut Spoiled: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా కొబ్బరికాయ కొట్టంది పూర్తికాదు. మొదలుపెట్టిన పని ఎటువంటి ఆటంకాలు రాకుండా పూర్తికావాలని కొబ్బరికాయ పగలగొడుతారు.
Coconut Spoiled: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా కొబ్బరికాయ కొట్టంది పూర్తికాదు. మొదలుపెట్టిన పని ఎటువంటి ఆటంకాలు రాకుండా పూర్తికావాలని కొబ్బరికాయ పగలగొడుతారు. పూజ ప్రారంభంలో కొబ్బరికాయను పగలగొట్టే సంప్రదాయం ఈనాటిది కాదు చాలా సంవత్సారాల నుంచి వస్తోంది. పూజ సమయంలో పగలకొట్టిన కొబ్బరికాయ కొన్నిసార్లు పాడవుతుంది. దీనిని చాలామంది చెడు సంకేతంగా భావిస్తారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఈ రోజు తెలుసుకుందాం.
1. కొబ్బరికాయను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ పాడైపోతే భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి కొబ్బరికాయ చెడిపోయి రావడం మంచి సంకేతాన్ని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి ఆరాధన అర్ధవంతమైనదని తెలుపుతుంది.
2. కొన్నిసార్లు కొబ్బరి పగలగొట్టినప్పుడు అందులో నీరు ఉండదు. కొబ్బరి మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితిలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచి సంకేతమే. వాస్తవానికి, ఎండు కొబ్బరి బయటకు రావడం అంటే ఆ వ్యక్తి పూజ లేదా యాగం చేస్తున్న కోరిక నెరవేరుతుందని అర్థం.
3. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు పువ్వు వస్తే అది శుభ సంకేతాన్ని సూచిస్తుంది. పూజించిన వ్యక్తి కోరిక నెరవేరుతుందని అర్థం. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరిని ముక్కలుగా చేసి ప్రసాదంగా అందరికీ పంచాలని గుర్తుంచుకోండి. దీని ద్వారా పూజా ఫలం లభిస్తుంది.