Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి...
Rasi Phalalu Today: ఈ రోజు రాశి ఫలాలు...
Rasi Phalalu Today: ఈ రోజు (24-03-2022) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
మేషం:
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.
వృషభం:
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మిథునం:
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
కర్కాటకం:
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
సింహం:
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
కన్య:
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
తుల:
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.
వృశ్చికం:
శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.
ధనుస్సు:
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.
మకరం:
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.
కుంభం:
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
మీనం:
ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం శుభప్రదం.