Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు శారీరకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పనిప్రదేశంలో అదనపు ఆదాయం ఉంటుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. భవిష్యత్తులో పెద్ద ఖర్చుల కోసం ప్రణాళిక రూపొందించుకుంటారు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. సాయంత్రం సమయంలో ప్రయాణాలు చేసే అవకాశముంది
వృఫభరాశి: ఈ రాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ చూపిన తర్వాత కూడా పనులు ఆలస్యమవుతాయి. చాలా లాభాలు అందుకుంటారు. నూతన సంబంధాల ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నూతన ప్రణాళికలపై శ్రద్ధ పెడతారు. ఆకస్మిక ఖర్చులు వస్తాయి.
మిథున రాశి: ఈ రోజు చంద్రుడు మీ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రోజు డబ్బు ఖర్చు అవుతుంది. పని ఒత్తిడి అలాగే ఉంటుంది. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. రోజువారీ వ్యాపారులు మరింత కష్టపడాలి. స్టేషనరీ లేదా ప్రింటింగ్ సంబంధిత పనుల్లో ఉండేవారు ఊహించని నూతన ఉద్యోగాలు పొందుతారు. కుటుంబం కోసం ఎక్కువ కష్టపడతారు. అవసరానికి అనుగుణంగా ఆదాయం లభిస్తుంది.
సింహ రాశి: సింహ రాశి వారు ఆర్థిక పరంగా మీకు సంతృప్తికరంగా ఉంటుంది. కార్యాలయంలో సేల్స్ పెరగడం వల్ల డబ్బు పెరుగుతుంది. వ్యక్తిగత కారణాల వల్ల మీ ఇమేజ్ పెరుగుతుంది. డబ్బు చేతికి రాగానే మీరు క్రేజీగా ఆలోచిస్తారు. కుటుంబ సమస్యల వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా వివాదాలు పెరిగిగే అవకాశముంది. మధ్యాహ్నం పనిచేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్యా రాశి: ఈ రాశి వారు అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. మనస్సులో ప్రతికూల భావాలు మెదులుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రతికూలతలు ఎదురైనప్పుడు కోపాన్ని నియంత్రించండి.
తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. కొన్ని అపార్థాల కారణంగా ఇంటి వాతావరణం చెడిపోతుంది. మీ దినచర్య నుంచి ప్రయోజనం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పనిప్రదేశంలో సహచరులు మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రోజు మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల సరైన ఫలితాలు పొందుతారు. పరిచయస్తుల సహకారం వల్ల ప్రయోజనం అందుకుంటారు. అశుభ వార్తల మనస్సు చెదిరిపోతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ అజాగ్రత్త, అసమ్మతి వల్ల మీ దినచర్య చెడిపోతుంది. శారీరక అలసట, అనారోగ్యతను అనుభవిస్తారు. వ్యాపార, వాణిజ్యాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక సంబంధిత పనులు కొనసాగుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాలను పట్టించుకోకపోతే మంచిది.
మకర రాశి: ఈ రాశి వారు శారీరకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముంది. రోజువారీ పనులు ప్రభావితమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పనిప్రదేశంలో ఉన్నతాధికారులతో విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యంపై దృష్టి పెడితే మంచిది. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.
కుంభరాశి: ఈ రోజు మీరు మధ్యాహ్నం తర్వాత ఏదైనా శుభవార్త అందుకుంటారు. ఫలితంగా మీరు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా ప్రయోజనాలు అందుకుంటారు. మీ మనశ్శాంతికి భంగం వాటిల్లదు. నిరాశ పరిచే ఆలోచనలకు దూరంగా ఉండండి. నిషేధించే పనుల నుంచి డబ్బు సంపాదిస్తారు. నూతన పరిచయస్తుల ద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయి.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారి పని సజావుగా సాగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కొన్ని విషయాల్లో ఇంటి పెద్దలతో విభేదాలు, అభిప్రాయభేదాలు ఉండవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా తిరిగి పూర్తి చేసుకుంటారు. అయితే కొంత సమయం తర్వాతా పరిస్థితి సాధారణమవుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581