Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
నేటి దినఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారికి ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.
వృఫభరాశి: ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నింటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సమర్థవంతంగా పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
తులా రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఉద్యోగ, వివాహ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువుతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు.
మకర రాశి: ఈ రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు.
కుంభ రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారు ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాతో గడుపుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా కొన్ని మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు లాభాలతో నిలకడగా ముందుకు సాగుతాయి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581