Daily Horoscope: ఈరోజు మీరోజు!ఈ రాశివారికి భూవివాదాలు కొలిక్కి వస్తాయి

Daily Horoscope: వివిధ రాశుల వారి దిన‌ఫ‌లాలు

Update: 2021-05-06 00:36 GMT

Daily Horoscope

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| చైత్ర మాసం వసంత బుతువు| ఉత్తరాయణం గురువారం| సూర్యోదయం: 5.38 | సూర్యాస్తమయం సా.6.16| తిథి దశమి సా.గం.4.57వరకు | తదుపరి ఏకాదశి |నక్షత్రం శతభిషం సా.గం.5.31 వరకు| తదుపరి పూర్వభాద్ర |రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు| యమగండం ఉ.06.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.8.10 నుంచి 9.53 వరకు| దుర్ముహూర్తం ఉ. 09.48 నుంచి 10:56 వరకు పున్నః మ.02:56 నుంచి 03.47 వరకు| అమృతఘడియలు ఉ.6.16నుంచి 7.50 వరకు|

ఈ రోజు రాశిఫలాలు 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి, ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

వృషభం: మొదట్లో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అనుకూలిస్తుంది. రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు తీరుస్తారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మిథునం: మీ శ్రమ ఫలించే సమయం. కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ , ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం:కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం.

సింహం: ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆదాయం ఆశాజనకమే. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.

కన్య:కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు సమస్యలు తీరి ఒడ్డునపడతారు.

తుల: కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత చేకూరుతుంది. పాత విషయాలు నెమరువేసుకుంటారు. కార్యజయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: ఆదాయం మెరుగుపడుతుంది. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం.

మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి సహాయం అందుతుంది. అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం: ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అధికలాభాలు లభించే వీలుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.

Tags:    

Similar News