Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి ప్రతి రంగంలోనూ మహిళలు ఈ రోజు విజయాన్ని అందుకుంటారు.
Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శనివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషం: ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. రోజంతా ఏదోక రకమైన ఏర్పాట్లు చేస్తూ గడుపుతారు. మీరు ఆర్థిక పరంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో శ్రేయస్సు, సంతోషం పెరుగుతుంది. ప్రపంచం గురించి ఈ రోజు మీ అభిప్రాయాన్నిమార్చే అవకాశముంటుంది. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు నూతన ఉద్యోగం కోసం చూస్తుంటే ఈ రోజు విజయం సాధించవచ్చు.
వృషభం: ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఉత్తమమైన ఆస్తి లభిస్తుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. చాలారోజులుగా ఆగిపోయిన చెల్లింపులను ఈ రోజు పొందవచ్చు. ఈ రోజు చంద్రుడు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఆగిపోయిన పనుసు తిరిగి ప్రారంభించవచ్చు. వ్యాపార రంగంలో నూతన భాగస్వాములు వస్తారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు.
మిథునం: ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అతిథులు వచ్చే అవకాశముంది. ఫలితంగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో మీరు ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు.
కర్కాటకం: రోజు కర్కాటక రాశి వారు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఈ రోజు యజమాని ఆశీర్వాదం లభిస్తుంది. ఫలితంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. పెట్టుబడుల్లో పెరుగుదల ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనిని చేయడానికి ప్రయత్నిస్తే మీకు మంచి జరుగుతుంది.
సింహ:ఈ రోజు సింహ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా అదృష్టం బాగా కలిసి వస్తుంది. పనిప్రదేశంలో సహచరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వాములతో నిజమైన చిత్తశుద్ధి, మంచి స్వరాన్నికలిగి ఉండటం వల్ల మీరు ప్రజలను హృదయాలను గెలుచుకోవచ్చు.
కన్య: ఈ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో కొలిగ్స్ మీకు సహకరిస్తారు. మనస్సులో ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. మీరు మీ భాగస్వామిని సంతోషంగా పెట్టగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మౌనంగా ఉండటం ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
తులా: ఈ రోజు మీరు సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా నేడు మీకు బహుమతులు, గౌరవం లభిస్తుంది. సన్నిహితుడి సలహా, మద్దతుతో మీరు పనులు చక్కగా నిర్వహించగలుగుతారు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకండి. ఈ రోజు మీరు మీ పిల్లల విషయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు విషయంలో ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి.
వృశ్చికం: ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రతి సందర్భంలో విజయాన్ని అందుకుంటారు. మీ పనితీరు మెరుగుపరచుకుంటారు. నిపుణుల సలహా భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. నిపుణుల సలహా మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు భాగస్వామితో కలిసి నడవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా సాధ్యమైన విధంగా మీకు సహాయం చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీరు నిరాశ చెందాల్సిన పనిలేదు.
ధనుస్సు: ఈ రోజు గ్రహాల శుభస్థితి కారణంగా మీరు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. మీ నిధులు కూడా పెరుగుతాయి. మీ సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శాశ్వత విజయానికి దారితీస్తుంది. ఈ రోజు మీ ఆదాయం పెరుగుతున్న కారణంగా మీరు ఎక్కడి నుంచైనా నూతన వనరులు పొందవచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సాయంత్రం ఎవరైనా మీరు ఇంటికి రావచ్చు.
మకరం: ఈ రోజు మకర రాశి వారు బిజీగా ఉంటారు. వ్యాపారం దృష్టి పెడతారు. మధ్యాహ్నం నాటికి గందరగోళంగా ఉన్న వ్యాపారాన్ని సరైన క్రమంలో ఉంచుతారు. ప్రతి రంగంలోనూ మహిళలు ఈ రోజు విజయాన్ని అందుకుంటారు. చేపట్టి పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
కుంభం: ఈ రోజు మీకు అదృష్టం కలిసి వచ్చి సంపద పెరుగుదల కనిపించే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. శత్రువుల ఆందోళనను అణచివేస్తారు. ప్రతి విషయంలో విజయం అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నేహితులు ఇంటికి రావడం వల్ల ఆనందకరంగా ఉంటుంది.
మీనం: మీన రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు లాభాలు వచ్చే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో కొంత సమయం గడపడం మంచిది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581