Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సరదగా సమయాన్ని గడుపుతారు.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope: ఈ రోజు రాశిఫలాలు Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు
నేటి రాశిఫలితాలు
మేషరాశి: ఈ రోజు మేష రాశి ప్రజలు ఇతరులకు సహాయం చేస్తారు. కాబట్టి సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ సహోద్యోగులు మానసిక స్థితి చెదిరిపోతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదగా సమయాన్ని గడుపుతారు. మధ్యాహ్నం సమయంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. సంతాన సంబంధిత సమస్యలు ముగుస్తాయి. ఈ రోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సాయంత్రం సమయంలో స్నేహితుడి రాక ఆనందాన్నిస్తుంది. అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటారు. శుభకరమైన పనిలో చేరడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి: ఈ రాశి వారికి తండ్రి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువు లేదా ఆస్తి పొందాలనే కోరిక బలంగా ఉంటుంది. అనవసర వ్యయాన్ని నివారించండి. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం చూస్తుంటే మంచి అవకాశాలు రావచ్చు.
కర్కాటకరాశి: ఈ రాశి అధిపతి అయిన బృహస్పతి వల్ల ఈ రోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవచ్చు. వ్యాపార ప్రణాళికలు ఊపందుకంటాయి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తుల సమస్యలు సృష్టించే అవకాశముంది. సాయంత్రం సమయంలో దైవదర్శనం చేసుకుంటారు. పేదవారికి వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఆహారం, పానీయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: ఈ రోజు సింహ రాశి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి అకాల విజయం లభిస్తుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. పోటీ రంగంలో ముందుకు సాగుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో మీకు లాభాలు పొందే అవకాశముంది. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి. సామాజిక దూరం పాటించండి.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం నుంచి ఆనందం పొందుతారు. సృజనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతికూల సమయంలో కోపాన్ని నియంత్రించండి. ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ రోజు వ్యాపారంలో ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సూర్యాస్తమయం తర్వాతా ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు.
తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. పనిప్రదేశంలో మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఈ రోజు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలుంటాయి. ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి నుంచి తగిన మద్దతు లభిస్తుంది. భార్యతో ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. గ్రామీణ పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ సంపద, గౌరవం, కీర్కి పెరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. సాయంత్రం సమయంలో స్నేహితుడితో సమావేశమవుతారు. ఫలితంగా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో మీకిష్టమైనవారితో సంయమనం పాటించండి. రాత్రి సమయంలో నడక సరదాగా అనిపిస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఇంటి అవసరాలకు ఖర్చు చేస్తారు. ప్రాపంచీక ఆనందాలు ఉంటాయి. సహోద్యోగులు లేదా బంధువులు కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు సంబంధిత పనుల్లో సమస్యలకు దారితీయవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
మకర రాశి: వ్యాపార రంగంలో మనస్సు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మకర రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. వ్యాపార మార్పులు ప్రణాళిక వేసుకుంటారు. ఈ విషయంలో తప్పనిసరిగా మీరు మీపై అధికారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. పోటీ పరీక్షలో విజయం అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కుంభంరాశి: ఈ రోజు శని కారణంగా జీవిత భాగస్వామికి శారీరక సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. అయితే చింతించకండి. ఓపికగా ఉండండి. ఆస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి. పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమాచారం కచ్చితంగా తెలుసుకోండి. తద్వారా మీకు ఎలాంటి హాని జరుగదు. మీ మాటలపై నియంత్రణ కలిగి ఉండండి.
మీనరాశి:ఈ రోజు మీన రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పురోగతి చెందడం వల్ల మీ మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు మానసిక మేధోభారం నుంచి బయటపడతారు. ఏదైనా ముఖ్యమైన సమాచారం సాయంత్రం అందుకోవచ్చు. పాత స్నేహితులను కలవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581