Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పట్టుదలతో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో కొత్త విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పంటి నొప్పి వచ్చే అవకాశం. కావలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు విసుగు తెప్పిస్తాయి. కారణాలు చెప్పి తప్పించుకోవటం కన్నా పని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి పై అధికారుల మెప్పు పొందండి. ఖర్చు అవసరాలు చాలా ఉన్నాయి ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టండి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లల పురోగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు సభలు సమావేశాలలో పాల్గొనటానికి ఆహ్వానం అందుతుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. స్థిరాస్తుల వ్యవహారాలలో సరైన తీసుకుంటారు. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు లేవు అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అధిక శ్రమ వలన మెడనొప్పి బాధించవచ్చు. కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తీసుకొస్తాయి.
తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు నగలు మరియు ఖరీదైన ఇంటి సామాను కొనే అవకాశం. ఉద్యోగంలో మీ ప్లాన్ లను సరిగా అమలు పరచండి. అందరి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చే అవకాశం. అనుకున్న పనులు పూర్తి కావాలంటే దైవ సహాయం కొరకు ప్రార్థించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబంలోని ఒక వ్యక్తి గొంతెమ్మ కోరికలు కోరడం వలన మీకు మనశ్శాంతి కరువు అవుతుంది.
ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో అతిశీఘ్రంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులను ప్రణాళిక ప్రకారం పెట్టండి లాభాలు వస్తాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ చేతికి అందిన వన్నీ మీవే. ఉద్యోగంలో అతి శ్రమ వలన నిరాశ. పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి..
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు అనేక విధాలుగా పెట్టిన పెట్టుబడుల నుంచి మీకు ధన లాభం. ఉద్యోగంలో అధిక శ్రమ. సరైన ప్రణాళిక వేసుకొని ఆఫీసులో పనులు పూర్తి చేయండి. నిరాశ వాదము, విచారం రెండు వదిలివేయండి. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అనుకున్న ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. భూమి కొనుగోలుకు సంబంధించి శుభవార్త అందుతుంది. కుటుంబం లోని వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581