Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 28th Aprilమేషం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వృషభం: చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథునం: చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం: ప్రయత్నసిద్ధి ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
సింహం: చిత్తశుద్ధితో చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
కన్య: చిత్తశుద్ధితో చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
తుల: మిశ్రమకాలం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది
వృశ్చికం: ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు.
ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది.
మకరం: మనస్సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ఏలిన నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది.
కుంభం: మనస్సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీనం: చేపట్టే పనుల్లో గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581