Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు వ్యాపారంలో మీ భాగస్వాములతో మంచి సంబంధాలను కలిగి వుంటారు.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేష రాశి: ఈ రాశి వారికి ఈ రోజు పనిప్రదేశాల్లో అకూలంగా వుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. చేపట్టిన పనులు, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. కానీ కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది. వ్యాపారంలో నూతన భాగస్వాములను చేర్చుకుంటారు. ఫలితంగా లాభం పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అభివృద్ది కలుగుతుంది. మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అతిథులు ఇంటికి రావచ్చు. ఆగిపోయిన పనులు ఈ రోజు తిరిగి పూర్తి చేసుకుంటారు. పనిప్రదేశంలో మీ తెలివితేటలు, అనుభవంతో ప్రయోజనాలు అందుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఫలితంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో మీ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభం అందుకుంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
కన్యా రాశి: ఈ రాశి వారికి మీ ఇంటికి అతిథులుగా రావచ్చు. వారిని గౌరవించడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఈ వ్యక్తులు తర్వాత మీకు అండగా నిలుస్తారు. పనిప్రదేశంలో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. ఎందుకంటే మీకే నష్టం జరగవచ్చు. వీలైనంత వరకు మీ కోపాన్ని నియంత్రించుకోండి. లేకుంటే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు.
తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో లాభాలు అందుతాయి. ఫలితంగా మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా సంతోషంగా ఉంటారు. ప్రజలు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. చాలా మందిని ప్రభావితం చేస్తారు. సన్నిహితుడి సలహా, మద్దతు కారణంగా ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు నూతన ప్రయత్నాలు చేస్తే అందులో విజయం లభిస్తుంది. ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరును మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. పెద్దవారి సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మీకు ఆనందకరంగా ఉంటుంది.
ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే సంకేతాలు ఉన్నాయి. ఇది మీకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది. వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది మీకు శాశ్వత విజయాన్ని అందుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారంపై దృష్టి పెట్టాల్సి ఉంది. తద్వార డబ్బు అధికంగా సంపాదిస్తారు. ఈ రోజు మీరు పని, వ్యాపారం పూర్తి చేసుకోండి. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం ఉత్తమ. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాల ఉంటాయి.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు వ్యాపార పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇందులో మీరు పురోగతి సాధిస్తారు. మీకు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. మీ తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడిస్తారు. పట్టువీడకుండా ప్రయత్నిస్తే అనుకున్న పనిలో విజయవంతమవుతారు.
మీన రాశి: ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కలసి వస్తాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి. భవిష్యత్ ప్రణాళికలపై మంచి పట్టు సాధిస్తారు.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581