Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వైపు నుంచి నిరాశ పరిచే వార్తలను వింటారు. సాయంత్రం ఆగిపోయిన పనులు, వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాత్రి సమయంలో మీకిష్టమైన వారిని కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
వృషభరాశి: ఈ రాశి వారికి రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పాలన, అధికారం ద్వారా ప్రయోజనాలు అందుకుంటారు. ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. రాత్రి సమయంలో ఇష్టం లేని వ్యక్తులను కలుస్తారు. ఫలితంగా వారితో వాదనలు ఉండవచ్చు
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పరీక్షల్లో విజయం సాధించడం మీ మనస్సుకు ఆనందంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు ఏదైనా శుభవార్తలు వినే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి.
సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు పోటీ పరీక్షల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు. కొంతమందికి ఇది అసౌకర్యగా అనిపించవచ్చు. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో శత్రువులు నాశనం అవుతారు. నూతన ఆదాయ వనరులు కలసి వస్తాయి.
కన్యా రాశి: ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో అనూహ్య విజయాన్ని అందుకుంటారు. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు పొందుతారుు. మధ్యాహ్నం చట్టపరమైన వివాదాల్లో లేదా దావాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఆనందానికి కారణం అవుతుంది.
తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీలు ఈ రోజు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ప్రయాణాలను కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటారు. ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని అంతర్గత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. శరీరానికి కొంత విశ్రాంతి అవసరం. పనిలో అంతగా ఆసక్తి చూపించరు.
ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అధికార పక్షంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అత్తగారి వైపు నుంచి ప్రయోజనం అందుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సహోద్యోగుల నుంచి గౌరవ, మర్యాదలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా వుండాలి. కొన్ని ప్రతికూల వార్తలు కారణంగా మీరు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆగిపోయిన పనులు, అసంపూర్తిగా ఉన్న వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. విలువైన వస్తువులను కోల్పోయే ప్రమాదం వుంది కాబట్టి జాగ్రత్తగా వుండాలి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖర్చు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581