Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు.
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ మాటలపై నియంత్రణం ఉంచండి. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకండి. ఈ రోజు ప్రత్యర్థులు మీ చేతిలో ఓడిపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభరాశి: ఈ రాశి వారిరు చేపట్టిన పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ జీవితంలో ప్రేమ, పరస్ఫర సామరస్యం ఉంటుంది. దేని గురించైనా ఆలోచిస్తూ మానసిక ఆందోళన చెందే అవకాశముంది. పోటీ పరీక్షల కోసం మీరు పడిన కష్టం వృథా కాదు. ప్రత్యర్థి జట్టు ఓడిపోతుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విలువైనదాన్ని కోల్పోయే అవకాశముంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. వీలైనంతవరకు నిర్లక్ష్యాన్ని నివారించండి. పనిప్రదేశంలో సమస్యలు దూరమవుతాయి. వినోద అవకాశాలు అందుకుంటారు. ప్రత్యర్థులు మీ చేతుల్లో ఓడిపోతారు. మీ మనస్సు పరధ్యానంలో ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశిలో చంద్రుడు నాలుగో పాదంలో ఉండటం వల్ల గృహవసరాలు పెరుగుతాయి. సహోద్యోగులు లేదా బంధువుల కారణంగా ఒత్తిడి కనుగొనవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టాలు సంభవించవచ్చు. అత్తమామల వైపు నుంచి ప్రయోజనం అందుకుంటారు.
కన్యా రాశి: ఈ రాశి వారి మాటల్లో మృదుత్వం కారణంగా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహారం మితంగా తీసుకొని వీలైనంత వరకు వ్యాయామం చేయండి. పాత స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడపుతారు.
తులా రాశి: ఈ రాశిలో చంద్రుడు రెండో పాదంలో ఉండటం వల్ల మీ ప్రయత్నాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అత్తమామల నుంచి ప్రయోజనం అందుకుంటారు. ఏ వ్యక్తితోనూ చర్చలో పాల్గొనవచ్చు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో విజయం అందుతుంది. అంతేకాకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. అయితే ఆహారం, పానీయాల విషయంలో సంయమనం పాటించండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి. సామాజిక దూరం పాటించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి: మీ రాశి స్వామి బృహస్పతి కుంభంలో రాశిలో ఉండటం వల్ల రహస్య శత్రువులు మిమ్మల్ని చూసి అసూయ పడే అవకాశముంది. కాబట్టి సహచరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. మీ ప్రవర్తనతో ప్రజలు ప్రభావితమవుతారు.
మకర రాశి: ఈ రాశి మీ రాశి స్వామి బృహస్పతి కుంభంలో రాశిలో ఉండటం వల్ల రహస్య శత్రువులు మిమ్మల్ని చూసి అసూయ పడే అవకాశముంది. కాబట్టి సహచరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. మీ ప్రవర్తనతో ప్రజలు ప్రభావితమవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతానం వైపు నుంచి ఆందోళన ఉండవచ్చు.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు రాజకీయ రంగంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. పనిప్రదేశంలో అధికారులు, సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించండి. కొంతమంది అవసరమైన కారణాల వల్ల ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది. అంతేకాకుండా బహుమతులు, గౌరవాలు ఈ రోజు పెరగవచ్చు. అత్తగారి వైపు నుంచి ఒత్తిడి నెలకొంటుంది. స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581