Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Update: 2021-05-21 00:25 GMT

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రాశి వారికి వారి తెలివితేటలు, అవగాహనతో చాలా క్లిష్టమైన విషయాలను పరిష్కరించుకుంటారు. ఎందుంకటే మీ అంచనాలకు అనుగుంగా ఉండరు. ఇల్లు, కార్యాలయంలో అన్ని సమస్యలను సహనంతో, సంయమనంతో విజయవంతంగా పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో ఈ రోజు మీరు కొంత బీజీగా ఉంటారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు అందుకుంటారు. మీరు వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో కొంతమంది మీ వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు. వారు తమ భావాలను వ్యక్తపరచలేరు.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో ఏదైనా ఒప్పందానికి అంతరాయం కలగవచ్చు. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు ఉంటాయి. మీరు ఏదైనా డబ్బు గురించి స్నేహితుల నుంచి సహాయం తీసుకోవచ్చు. ఇది కొంతకాలం మీకు నిరాశకు గురిచేస్తుంది.

కర్కాటకరాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ సీనియర్ వ్యక్తుల సలహాలను పాటించడం ద్వారా ప్రయోజనం అందుకుంటారు. కార్యాలయంలో సహచరులు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఈ రోజు మీ పిల్లల కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ఎందుకంటే ఈ రోజు మీ ఔదర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

సింహ రాశి: ఈ రాశి వారు వారి జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడతారు. ఎందుకంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆర్థింగా మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి లేదా పిల్లల అభ్యర్థనను మీరు నెరవేర్చవచ్చు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈ రోజు పనిప్రదేశంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయోజనం పొదుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేస్తారు. మీరు ఒకరి గురించి చెడుగా భావిస్తే దాన్ని గుర్తుంచుకోవద్దు. మీ అపార్థాలను తొలగించుకునే సమయం ఇది.

తులా రాశి: ఈ రాశి వారికి నూతన ఆదాయ వనరులు ద్వారా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. తద్వారా మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. సృజనాత్మక పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. మీలో ప్రతిభను దాచడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు ఈ రోజు కార్యాలయంలో అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీ మానసిక స్థితి బాగుంటుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. షాపింగ్ చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

ధనస్సు రాశి: ఈరోజు రాశి వారు జీవిత భాగస్వామితో ఆనందపు క్షణాలు గడుపుతారు. పాత వివాదాలను మర్చిపోయి, మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి ప్రయత్నిస్తారు. మీరు దీన్ని చేయకపోతే మానసికంగా ఆందోళన చెందుతారు. నష్టాలను పూడ్చడానికి ఈ రోజు కష్టపడి పనిచేస్తారు.

మకర రాశి: ఈ రాశి ఈ రోజు ఏకాగ్రతతో ఏ పనిచేసినా అందులో విజయం సాధిస్తారు. మితిమీరిన భావోద్వేగాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలపై శ్రద్ధ పెడతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతించకుండా మీరు ప్రస్తుతం చేస్తున్న పనుల్లో దృష్టి పెట్టడం మంచిది. కార్యాలయంలో నూతన బాధ్యతలను పొందుతారు. మీరు దాని కోసం సిద్ధంగా ఉండాలి. మకర రాశి వారు పనిప్రదేశంలో లేదా కార్యాలయంలో మీకు సహాయం చేయవచ్చు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా మిమ్మల్ని పరధ్యానంగా ఉంచుతుంది. వాతావరణాన్ని సజీవంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార పరంగా సంభాషించినట్లయితే వ్యాపారంలో లాభం ఉంటుంది. వృద్ధులకు ఈ సమయంలో మీ మద్దతు అవసరం.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

   9381881581

Tags:    

Similar News