Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారు విలువైన వస్తువులు కొంటారు!!
Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 18 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | పంచమి - 09:15:39 వరకు తదుపరి షష్టి | పూర్వాభాద్ర నక్షత్రం - 07:43:22 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం 09:04:26 నుండి 09:49:21 వరకు | అమృత ఘడియలు 12:04:05 నుండి 12:48:59 వరకు | దుర్ముహూర్తం 12:48:59 నుండి 13:33:54, 15:03:43 నుండి 15:48:38 వరకు | రాహుకాలం08:13:55 నుండి 09:38:07 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59
ఈరోజు రాశిఫలాలు
మేషం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.
వృషభం: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.
మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు శుభవార్తలు. దైవదర్శనాలు.
కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.
ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.
మీనం: పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.