Daily Horoscope: ఈ రోజు మీరోజు!ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది. వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం ఉత్తరాయణం| వసంత ఋతువు చైత్ర మాసం| సూర్యోదయం : 5.49 | సూర్యాస్తమయం సా.6.11| తిథి పాడ్యమి ఉ.8.43| తదుపరి విదియ|నక్షత్రం అశ్వని ప.గం.12.58 వరకు| తదుపరి భరణి |రాహుకాలం ప. 3.00 నుంచి 4.30 వరకు| యమగండం 09.00 నుంచి 1.30 వరకు| వర్జ్యం ఉ.8.35 నుంచి 10.22 వరకు తదుపరి రా.9:37 నుండి 8:23 వరకు| దుర్ముహూర్తం ఉ.08.13 నుంచి 9.05 వరకు| అమృతఘడియలు -| కరణం బవ ఉ.08.50| యోగం విష్కంభం ప.12.18 గం.ల వరకు|
ఈ రోజు రాశిఫలాలు
మేషం :శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
తుల: మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం
మకరం: కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.