Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Update: 2021-05-12 00:30 GMT

Daily Horoscope:(File Image) 

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్తి వ్యవహారాలు ఇవాళ కలిసొస్తాయి. ఇతరులు మీ సెంటిమెంట్లతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటే... వారి చర్యల్ని నిశితంగా గమనించండి. ఆర్థిక వ్యవహారాల్లో ఓ కుదుపు వచ్చే అవకాశం ఉన్నా... దాని నుంచి తెలివిగా బయటపడతారు.

వృఫభరాశి: ఈ రాశివారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆచి తూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచింది. ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. రియాల్టీ రంగంలోని వారికి బాగా కలిసొస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రిలాక్స్ కోసం లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం ఆహ్లాదం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా కలిసొచ్చేందుకు మంచి సంకేతాలు ఉన్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి వ్యాపారుల తన వ్యాపారాలను విస్తరించేందుకు అనుకూలంగా వుంది. భాగస్వాములతో డీల్స్ కుదుర్చుకోవచ్చు. అకౌంటెంట్లు, బ్యాంకర్లకు అభివృద్ధి ఉంది. కుటుంబ సభ్యులు ఓ కోరిక కోరి... కొంత ఇరకాటంలోకి నెడతారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారం ఒకటి లాభం తెచ్చేలా కనిపిస్తోంది. ఇతరులకు సాయం చేసే అవకాశం నేడు మీకు లభిస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పోయి... డబ్బు రావడం మొదలవుతుంది. మీ ఐడియాని ఇతరులకు సరిగా చెప్పాల్సి ఉంటుంది లేదంటే వారు దాన్ని తిరస్కరిస్తారు. కుటుంబంలో మనస్పర్తలు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని సెట్ చేసుకోవాలి. వేకేషన్ ట్రిప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఓ సవాలు వస్తుంది... దాన్ని సరిగా చేస్తే మంచి పేరు వస్తుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. దూర ప్రయాణం ఒకటి వాయిదా పడుతుంది. ఓ ఆస్తిని భారీ లాభానికి అమ్మేస్తారు.

తులా రాశి: ఈ రాశి వారికి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా స్థిరపడేలా ఓ పెట్టుబడి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారులకు ఎదురుగాలులు వీస్తున్నాయి. కుటుంబంలో పెద్దవాళ్లు చెప్పే సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. తీర్థ యాత్రలకు వెళ్లాలి అనుకునేవారు ప్లానింగ్ సరిగా వేసుకోవాలి. లేదంటే ఇబ్బంది ఎదురవుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనేందుకు వేసుకునే ప్లాన్ ఓ పద్ధతిలో సాగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్థికంగా మరింత మెరుగవుతారు. పని విషయంలో మీ తెలివితేటలే మీకు పెట్టుబడిగా మారతాయి. కుటుంబంలో ఒకరు తీసుకునే నిర్ణయం మీకు తలనొప్పిగా మారుతుంది. సామాజికంగా మీరు ఏదో చేద్దామనుకున్న పని కాస్తా వాయిదా పడుతుంది. ఆస్తి వ్యవహారానికి సంబంధించి మంచి ఫలితం వస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి డబ్బు సంపాదన కోసం పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు చక్కగా సహకరిస్తారు. అలాగని వారిపైనే పూర్తిగా ఆధారపడవద్దు. ఆఫీసు పనిపై దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీరు ఇతురుల పట్ల తీసుకునే జాగ్రత్తలు... మీకు మంచి పేరు తెస్తాయి.

మకర రాశి: ఈ రాశి వారు ఆరోగ్యంపై ఫోకస్ పెడతారు. ఓ డైట్ చార్ట్ రెడీ చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. డబ్బు ప్రవాహంలా వచ్చేలా ఉన్నా... జాగ్రత్తగా పొందాలి. వృత్తి పరంగా మీ నైపుణ్యం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు. ఓ ప్రయాణం ఆనందంగా చెయ్యాలనుకుంటారు... కానీ అలా అది ఉండదు.

కుంభరాశి: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యల నుండి బయటపడేందుకు వ్యాయామాలు తప్పని సరిగా చేయాల్సి వుంటుంది. అనుకోకుండా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. చిరు వ్యాపారులకు నేడు కలిసొస్తుంది. చాలా కాలంగా ముందుకు సాగని ఓ వివాహ వ్యవహారం ఇప్పుడు చురుగ్గా మారి యాక్టివ్ అవుతుంది. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణం మధుర జ్ఞాపకం అవుతుంది.

మీనరాశి: ఈ రాశి వారు ఆరోగ్య బలం కోసం కాస్త ఆహారం కూడా తినాల్సి ఉంటుంది. మీకు ఏదో ఆస్తి లాంటిది వచ్చేలా ఉంది. వృత్తిలో వారు బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చెయ్యాల్సిన టైమ్. సంతానం నుంచి శుభవార్త వింటారు. మీరు ఉన్న చోట ఏదో ఆనందం కలిగించే సంఘటన మీకు ఎదురవుతుంది. ఆస్తి వ్యవహారాలు బాగానే నడుస్తాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Tags:    

Similar News