తిరుమల సమాచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల సాధారణరద్దీ కొనసాగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల సాధారణరద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచియున్నారు. వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (సోమవారం) శ్రీవేంకటేశ్వరస్వామివారిని 73,574 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు.