Breaking News: ప్రముఖ జ్యోత్యిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
Mulugu Ramalingeswara: ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు.
Mulugu Ramalingeswara: ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. టెలివిజన్ కార్యక్రమాల్లో వార ఫలాలు చెబుతూ రామలింగేశ్వర సిద్ధాంతి తెలుగువారికి చేరువైన విషయం తెలిసిందే. సిద్ధాంది చెప్పే రాశి ఫలాలను తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా విశ్వసిస్తుంటారు. ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.