Gods Offering Cashews: దేవుడికి జీడిపప్పు నైవేద్యంగా పెడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
Gods Offering Cashews: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇండ్లలో పూజ చేస్తారు. దేవుడికి హారతినిచ్చి నైవేద్యం సమర్పిస్తారు.
Gods Offering Cashews: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇండ్లలో పూజ చేస్తారు. దేవుడికి హారతినిచ్చి నైవేద్యం సమర్పిస్తారు. ముందుగా దేవుడికి పెట్టిన తర్వాతనే అందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. అయితే ఒక్కో దేవుడికి ఒక్కోరకం నైవేద్యం పెడుతారు. ఇది వారికి ఇష్టమైనదిగా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల కోరిన కోరికలు నెరవేర్చుతాడని భక్తులు నమ్ముతారు. భగవంతునికి నైవేద్యం పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొంతమంది దేవుళ్లకు జీడిపప్పును నైవేద్యంగా పెడుతారు. కానీ ఏయే దేవుళ్లకు జీడిపప్పు నైవేద్యంగా పెట్టాలో ఈ రోజు తెలుసుకుందాం.
గణేశుడు
వినాయకుడికి పాయసం, కుడుములు అంటే మహా ఇష్టం. వినాయకుడికి చాలామంది ఇవే నైవేద్యంగా పెడుతారు. అయితే బుధవారం వినాయకుడికి జీడిపప్పు నైవేద్యంగా పెట్టడం పెట్టవచ్చు. దీనివల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనితో పాటు బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి.
లక్ష్మిదేవి
శాస్త్రాల ప్రకారం లక్ష్మీ దేవికి తీపి అంటే చాలా ఇష్టం. అందుకే చాలామంది లడ్డు ప్రసాదం పెడుతారు. ఇది కాకుండా తల్లికి శుక్రవారం జీడిపప్పును నైవేద్యంగా సమర్పించాలి. దీనితో ఆమె త్వరగా సంతోషిస్తుంది ఇంట్లో డబ్బు ధాన్యాలను అందిస్తుందని నమ్మకం.
శివుడు
శాస్త్రాల ప్రకారం శివుడు ఒక్క క్షణంలో తన భక్తులకు ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా అతడికి ఖీర్, పాలు, పెరుగు, మొదలైనవి నైవేద్యంగా పెడుతారు. సోమవారం శివుడికి జీడిపప్పు నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.