Akshaya Tritiya 2023: 125 ఏళ్ల తర్వాత అరుదైన అక్షయ తృతీయ.. ఈ రాశుల వారికి తిరుగే ఉండదు..!
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ పండుగ ప్రధానంగా అదృష్టానికి ప్రసిద్ధి చెందింది.
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ పండుగ ప్రధానంగా అదృష్టానికి ప్రసిద్ధి చెందింది. ఎంతో శుభప్రదమైన ఈ పండుగ అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చే పర్వదినం. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకునే ఈ అక్షయతృతీయ అత్యంత విభిన్నం మరెంతో ప్రత్యేకమైంది కూడా. 125 ఏళ్ల తర్వాత ఇలాంటి అక్షయ తృతీయ ఏర్పడిందని...దీని ఫలితంగా కొన్ని రాశులకు అపూర్వ యోగం సిద్ధించనుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మేషరాశి: ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగంతో మేష రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. యోగం కారణంగా మేష రాశివారికి ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుండడమే కాకుండా సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభించే అవకాశం పుష్కలంగా ఉంది. అక్షయ తృతీయ రోజున దానధర్మాలు చేసే వారికి మరిన్ని మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభరాశి: పంచగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి జాతకులు మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. ఈ రాశి జాతకులకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. డబ్బు, పదవి కూడా లాభించనున్నాయ. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా దూరం అవుతాయి. ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి: అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా విశేష ప్రయోజనాలు కలుగనున్నాయి. ఈ సమయంలో ఏర్పడే ఆరు శుభ యోగాల వల్ల కర్కాటక రాశి వారు తాము పని చేస్తున్న రంగంలో ముందుకు వెళ్లడమే కాకుండా విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందగలరు. ఈ రాశి వారు అక్షయ తృతీయ సమయంలో ఏ పని చేసినా విజయాన్ని పొందగలరు.
సింహరాశి: అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగం సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి జాతకులకు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఈ యోగం కారణంగా పూర్తి కానున్నాయి. ఆర్థికంగా కూడా పురోగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశివారు చేసే ప్రయత్నాల్లో కుటుంబ పెద్దల సహకారం ఎంతగానో ఉంటుంది.