Vastu Tips: వాస్తు ప్రకారం.. చేతి నుంచి ఈ వస్తువులు జారిపోతే మంచిది కాదు..!

Vastu Tips: భారతదేశంలోచాలామంది వాస్తును నమ్ముతారు. ఇల్లు నిర్మించేటప్పడు, కార్యాలయాల్లో వస్తువులు ఉండే ప్రదేశాల గురించి, శుభకార్యాలు చేసేటప్పుడు తదితర విషయాల్లో కచ్చితంగా వాస్తును చూస్తారు.

Update: 2023-12-08 01:30 GMT

Vastu Tips: వాస్తు ప్రకారం.. చేతి నుంచి ఈ వస్తువులు జారిపోతే మంచిది కాదు..!

Vastu Tips: భారతదేశంలోచాలామంది వాస్తును నమ్ముతారు. ఇల్లు నిర్మించేటప్పడు, కార్యాలయాల్లో వస్తువులు ఉండే ప్రదేశాల గురించి, శుభకార్యాలు చేసేటప్పుడు తదితర విషయాల్లో కచ్చితంగా వాస్తును చూస్తారు. వాస్తు ప్రకారం ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. అయితే కొంతమంది వాస్తు నియమాలను మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. కానీ మరికొందరు కచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు చేతి నుంచి జారిపడకూడదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పాలు

వాస్తు ప్రకారం చేతిలో నుంచి పాలు కింద జారిపడితే మంచిది కాదు. ఇలా జరిగితే కుటుంబంలో గొడవలు జరుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిదే కానీ ప్రతిరోజు మంచిది కాదంటున్నారు.

ఉప్పు

వాస్తు శాస్త్రం ప్రకారం చేతిలో నుంచి ఉప్పు జారిపడి కిందపడకూడదు. ఇలా జరిగితే వచ్చే రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని అర్థం. ఉప్పు చేజారితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

బియ్యం

వాస్తు ప్రకారం బియ్యం, గోధుమలు చేతిలో నుంచి జారిపడకూడదు. ఇలా జరిగే వచ్చే రోజుల్లో ఆహార కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆహారపాత్రలు పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Tags:    

Similar News