Salt Vastu Tips: ఉప్పుతో పెద్ద ముప్పు.. ఉచితంగా వద్దు పెద్ద అప్పు..!
Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశల గురించి మాత్రమే కాకుండా రోజువారీ జీవితానికి సంబంధించి అనేక వస్తువుల గురించి కూడా చెప్పారు.
Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశల గురించి మాత్రమే కాకుండా రోజువారీ జీవితానికి సంబంధించి అనేక వస్తువుల గురించి కూడా చెప్పారు. ఉదాహరణకు కొన్ని వస్తువులను దానం చేయడం అశుభం. అదేవిధంగా కొన్ని వస్తువులను అప్పుగా లేదా ఉచితంగా తీసుకోవడం కూడా అశుభమే. మన వంటింట్లో ఉండే ఒక పదార్థం గురించి అందరు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే జీవితాలు తారుమారైపోతాయి. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి దగ్గర నుంచైనా ఈ పదార్థం తీసుకోవడం అశుభకరంగా భావిస్తారు. దీనిని అప్పుగా తీసుకోవడం లేదా ఉచితంగా తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోవద్దు. ఉప్పును అప్పుగా తీసుకోమని అడగవద్దు. ఇలా చేయడం వల్ల మనిషి తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అతను పేదవాడు అవుతాడు, ఆర్థిక సమస్యలను అధిగమించడం కష్టమవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించడంలో, ఆర్థిక ఇబ్బందులు, నెగిటివిటిని తొలగించడంలో ఉప్పు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే సమయంలో ఉప్పుకు సంబంధించిన తప్పులు కూడా ఒక వ్యక్తిని పేదవాడిగా మారుస్తాయి. ఉప్పును ఉచితంగా తీసుకోవద్దు అలాగే దానికి సంబంధించి మరో పొరపాటును కూడా చేయవద్దు. వంటగదిలో ఉప్పు అయిపోనివ్వకండి. ఇంట్లో ఉప్పు అయిపోవడం వల్ల ధన నష్టం, పేరు ప్రతిష్టలు దిగజారుతాయి. ఉప్పు పూర్తిగా అయిపోకముందే ఇంటికి తీసుకురండి.