Religion News: శివ పురాణం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఈ 4 సంకేతాలను చూస్తాడు..!

Religion News: భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఎందుకంటే ఇది సృష్టి ధర్మం. ఈ విషయం అందరికి తెలుసు అయినప్పటికీ చాలామంది మరణం అనేసరికి భయపడి పోతుంటారు.

Update: 2024-01-30 14:30 GMT

Religion News: శివ పురాణం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఈ 4 సంకేతాలను చూస్తాడు..!

Religion News: భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఎందుకంటే ఇది సృష్టి ధర్మం. ఈ విషయం అందరికి తెలుసు అయినప్పటికీ చాలామంది మరణం అనేసరికి భయపడి పోతుంటారు. వారు బతకాడానికి ఎంత ప్రయత్నించినా వారి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా వెళ్లిపోవాల్సిందే. శివ పురాణంలో మరణానికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించారు. ఇందులో శివుడి అవతారాల గురించి వర్ణించారు. ఒక వ్యక్తి జనన మరణానికి సంబంధించిన అనేక విషయాలు శివపురాణంలో ఉంటాయి. ఈ పరిస్థితిలో మరణానికి ముందు ఒక వ్యక్తికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి

శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం దగ్గరకు వచ్చినప్పుడు అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. అందులో భాగంగా మరణానికి ముందు ఒక వ్యక్తి 5 ఇంద్రియాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల మరణం సమీపిస్తోందని అర్థం చేసుకోవచ్చు. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి శరీరం అకస్మాత్తుగా తెల్లగా లేదా నీలం రంగులోకి మారిపోతుంది. లేదా శరీరంలోని వివిధ ప్రదేశాలలో ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. వీటని బట్టి మరణ సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవచ్చు.

శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఎడమ చేయి అకస్మాత్తుగా మెలితిప్పినట్లుగా ఉంటుంది. నోటి పైభాగంలో ఎండిపోతుంది. ఇది మీకు ఎక్కువ సమయం లేదని సూచిస్తుంది. మరణం సంభవించబోతుందని తెలుస్తుంది. శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి చంద్రుడు, నక్షత్రాలను సరిగ్గా చూడలేకపోతే, ఒక వ్యక్తి గాజు లేదా నీటిలో అతడి ప్రతిబింబాన్ని చూడటం మానేస్తే మరణం చాలా దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి.

Tags:    

Similar News