Garuda Purana Facts: అకాల మరణం ఆత్మకు నరకం.. ఈ విషయాలు తెలిస్తే వణికిపోతారు..!
Garuda Purana Facts: పుట్టుక, మరణాలు అనేవి దైవ నిర్ణయం. ఈ ప్రపంచంలోకి ఎవరు వచ్చినా తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇది ఎవరూ మార్చలేని సత్యం.
Garuda Purana Facts: పుట్టుక, మరణాలు అనేవి దైవ నిర్ణయం. ఈ ప్రపంచంలోకి ఎవరు వచ్చినా తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇది ఎవరూ మార్చలేని సత్యం. మృత్యువు అంటే తప్పించుకోలేని పరిస్థితి. గరుడ పురాణం మరణం తరువాత ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని గడపడానికి అనేక మార్గాలు ఉన్నట్లే, మరణానికి సంబంధించిన అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
గరుడపురాణం ప్రకారం ప్రతి వ్యక్తి మరణం ఒకేలా ఉండదు. కొంతమంది జీవితంలో అన్ని ఆనందాలను అనుభవించి మరణిస్తారు. మరికొందరు అకాలంగా మరణిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొందరు మరణిస్తే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి మృత్యువును కౌగిలించుకుంటారు. ప్రతి ఆత్మ మరణానంతరం స్వర్గానికి లేదా నరకానికి వెళ్లవలసిన అవసరం లేదు. జననం, మరణంతో పాటు గరుడపురాణంలో మరణానంతర పరిస్థితులు గురించి కూడా వివరించారు.
అకాల మరణం అంటే ఏమిటి?
గరుడ పురాణం ప్రకారం ఆకలి, హత్య, ఉరి, విషం తాగడం, అగ్నిలో కాలడం, నీటిలో మునిగడం, ఏదైనా ప్రమాదం, పాము కాటు, ఆత్మహత్య, తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చనిపోవడం అకాల మరణాలు. వీటన్నింటిలో ఆత్మహత్య పాపంగా పరిగణిస్తారు. మనిషి భగవంతుని ద్వారా పుట్టాడు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది దేవుడిని అవమానించినట్లు అవుతుంది.
అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది?
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి పుట్టుక, మరణం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది. పాపాత్ములు, ఇతరులతో దురుసుగా ప్రవర్తించడం, స్త్రీలను అవమానించడం, దోపిడీ చేయడం, అబద్ధాలు చెప్పడం, అకృత్యాలు చేయడం వల్ల అకాల మృత్యువు సంభవిస్తుంది.
అకాల మరణం తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుంది..?
గరుడ పురాణం ప్రకారం అకాల మరణం పొందిన వారి ఆత్మ జీవిత కాలం అసంపూర్ణంగా ఉంటుంది. అటువంటి ఆత్మల జీవిత చక్రం పూర్తి కాక వారు స్వర్గాన్ని పొందలేరు నరకానికి వెళ్లలేరు. అలాంటి ఆత్మలు సంచరిస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తి అకాలంగా మరణిస్తే అతని ఆత్మ దయ్యాలు, భూతాలు, పిశాచాలు, కూష్మాండ, బ్రహ్మరాక్షసులుగా మారుతుంది.