Mahashivratri 2024: శివరాత్రి రోజు ఈ 5 వస్తువులతో అభిషేకం చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం..!
Mahashivratri 2024: ఈ ఏడాది మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి పండుగ వస్తోంది. ఈ రోజు అందరు ఉపవాసం ఉండి ఆ శివపరమాత్ముడి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తారు.
Mahashivratri 2024: ఈ ఏడాది మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి పండుగ వస్తోంది. ఈ రోజు అందరు ఉపవాసం ఉండి ఆ శివపరమాత్ముడి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ రోజున పరమశివుడు పార్వతిల కల్యాణం జరిగింది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో పూజిస్తారు శివలింగానికి అభిషేకం చేస్తారు. అయితే ఈ 5 వస్తువులతో రుద్రాభిషేకం చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఆవనూనె
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆవనూనెతో శివుడికి అభిషేకం చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆత్మకు శాంతి, స్థిరత్వం లభిస్తాయి. శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది.
గంగాజలం
గంగాజలంతో రుద్రాభిషేకం చేయడం వల్ల వ్యక్తికి ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాదు ఈ నీరు అనేక రకాల వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రంథాల ప్రకారం రుద్రాభిషేకం సమయంలో గంగాజలాన్ని ఉపయోగించడం వల్ల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ పవిత్ర జలంతో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. రుద్రాభిషేకం చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జనపనార రసం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనపనార రసంతో రుద్రాభిషేకం చేయడం వల్ల అనేక ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆత్మకు శాంతిని అందిస్తుంది. పరమ శివుడి అనుగ్రహం లభిస్తుంది.
నెయ్యితో రుద్రాభిషేకం
గ్రంథాల ప్రకారం నెయ్యితో రుద్రాభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు లభిస్తాయి. శివారాధనలో నెయ్యి ఉపయోగించడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఇది ఇంట్లో ఆనందం, సంతోషం తెస్తుంది.
చక్కెర నీటితో
మహాశివరాత్రి రోజు చక్కెర నీటితో రుద్రాభిషేకం చేస్తే ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. పంచదార నీటిని భక్తితో సేవిస్తారు. రుద్రాభిషేకం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందుతారు. తల్లి పార్వతి కూడా సంతోషిస్తుంది.