Religion News: ఒక వ్యక్తి ఈ 3 పనులు చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి.. అవేంటంటే..?
Religion News: హిందూ సంప్రదాయం ప్రకారం కచ్చితంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. వీటి గురించి రుషులు, సాధువులు ముందుగానే చెప్పారు.
Religion News: హిందూ సంప్రదాయం ప్రకారం కచ్చితంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. వీటి గురించి రుషులు, సాధువులు ముందుగానే చెప్పారు. మన ప్రాచీనులు కూడా వాటిని పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి విషయాలను వారు ఊరికే చెప్పలేదు. ప్రతి దానిలో ఒక పరమార్థం దాగి ఉంటుంది. అందుకే కచ్చితంగా వాటిని పాటించాలి. ఒక వ్యక్తి మూడు పనులు చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి. ఆ పనుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
శ్మశానం నుంచి వచ్చిన తర్వాత
ఒక వ్యక్తి శ్మశాన వాటిక నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. వాస్తవానికి శ్మశాన వాటికలో అనేక రకాల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది వ్యక్తి మనస్సు, హృదయంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే అంత్యక్రియల ప్రక్రియలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి శ్మశాన వాటిక నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తప్పనిసరిగా స్నానం చేయాలి.
ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత
ఒక వ్యక్తి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ పనిని ఉదయాన్నే చేయాలి. నిజానికి ఆయిల్ మసాజ్ తర్వాత స్నానం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల రంద్రాల నుంచి బయటకు వచ్చిన మురికి పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత ఆరోగ్యంగా ఉంటారు.
జుట్టు కత్తిరించిన తర్వాత
ఒక వ్యక్తి షేవింగ్ లేదా జుట్టు కత్తిరించుకున్న తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. నిజానికి, స్నానం చేయడం ద్వారా శరీరానికి అంటుకున్న జుట్టు తొలగిపోతుంది. ఇది తర్వాత వ్యక్తిని ఇబ్బంది పెట్టదు.