
Photo puzzle: ఈ ఫొటోలో ఓ మిస్టేక్ ఉంది.. అదేంటో కనిపెట్టగలరా?
Photo puzzle: ‘ఫోటో పజిల్స్’ అస్సలు బోర్ కొట్టవు. మెదడు చురుకుతనాన్ని పెంచుతూ, కంటి పవర్‌ను చెక్ చేసే ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటో ఫజిల్స్‌కు లేక్కేలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి బాగా నచ్చేలా ఉంటాయి. ఊహశక్తిని పెంచడం, ఫోకస్ మెరుగు పరచడం, చురుకుదనం పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఇలాంటి ఫొటో పజిల్స్‌లో ఉంటాయి.
సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ రోజూ కొత్త కొత్త పజిల్స్‌ను షేర్ చేస్తూ వ్యూయర్‌షిప్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి చాలా సింపుల్‌గానే కనిపించినా ఈ ఫొటోను సాల్వ్ చేసే సమయంలో ఆశ్చర్యపరిచే ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఏంటా ఫొటో? అందులో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పైన ఉన్న ఫొటోలో A to Z లెటర్స్ ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ చిన్న తప్పు దాగి ఉంది. అదేంటో గుర్తించారా? అయితే ఈ తప్పును కేవలం 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అని అర్థం. మరెందుకు ఆలస్యం ఓసారి ఈ ఫొటోను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతున్నారా? అయితే ఓసారి ఫొటోలో ఉన్న చివరి లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అందులోనే మీరు వెతుకుతోన్న మిస్టేక్ దాగి ఉంది. చివరిలో 'Find' అనే పదం తప్పుగా ఉంది. Findకి బదులుగా 'Fnid' ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్ ఇదే.
