Viral Video: పాముతో స్కిప్పింగ్ ఏంట్రా నాయనా.? వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి.

Viral Video: పాముతో స్కిప్పింగ్ ఏంట్రా నాయనా.? వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
పాముల పేరే చెబితే చాలన్నట్టు చాలామంది భయంతో వణికిపోతుంటారు. వాటిని ప్రత్యక్షంగా చూసిన వారు మళ్ళీ చూసేంత వరకూ ఆ దృశ్యాన్ని మర్చిపోలేరు. పొలాలు, చెట్లలో, కొంత సేపటికి రోడ్ల మీద కూడా ఇప్పుడు పాములు, కొండ చిలువలు కనిపించడం సాధారణమైపోయింది. వీటి వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఈ వీడియోలో కొంత మంది చిన్నారులు… ఓ చనిపోయిన కొండ చిలువను తాడులా పట్టుకుని, దాన్ని స్కిప్పింగ్ రోప్‌లా ఉపయోగించి ఆడుతున్నారు. ఈ విచిత్రమైన సంఘటన ఆస్ట్రేలియాలోని వూరాబిండా అనే గ్రామంలో చోటు చేసుకుంది. సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్‌లోని రాక్‌హాంప్టన్‌కు సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు రోడ్డు పక్కన చనిపోయి పడున్న ఓ భారీ కొండ చిలువను చూశారు. అయితే పాము చనిపోయినా భయం కలగడం కామన్. కానీ వీళ్లు మాత్రం… దాన్ని పట్టుకుని ఆటలో భాగంగా స్కిప్పింగ్ రోప్‌లా ఉపయోగించారు.
వీరిలో ఇద్దరు చిన్నారులు చిలువను ఇరువైపులా పట్టుకున్నారు. మరికొందరు దాని మధ్యలో స్కిప్పింగ్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. చివరికి దాన్ని తీసుకుని దూరంగా పడేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు "ఇంత ధైర్యం వీళ్లకు ఎక్కడినుండొచ్చింది?", "చిన్నప్పటి నుంచే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలా మారుతారో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.