When will we know about who will be the next US... ... US Election 2024 Results Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్

When will we know about who will be the next US President: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్స్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5 న ఎన్నికలు జరిగితే మరి ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి కమల హారిస్ కు, డోనల్డ్ ట్రంప్ కు మధ్య గట్టి పోటీ నెలకుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.

పెన్సిల్వేనియాలో రికౌంటింగ్‌కి వెళ్తే?

అసలు కౌంటింగే జరగనప్పుడు అప్పుడే పెన్సిల్వేనియాలో రీకౌంటింగ్ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అందుకు కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. 2020 ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ఎలక్టర్‌గా గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఓటింగ్ తేడా 1.1 శాతమే ఉంది.

ఈసారి కూడా అక్కడ పోటీ గట్టిగానే ఉందంటున్నారు. గట్టి పోటీ కారణంగా ఒకవేళ గెలుపు, ఓటముల మధ్య తేడా.05 శాతమే ఉన్నట్లయితే.. అక్కడ ఓడిన వారు రీకౌంటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపిస్తుందనేది వారి ఉద్దేశం. పైగా పెన్సిల్వేనియాలో ఓటర్ నమోదుపై తమకు అనుమానాలు ఉన్నాయని రిపబ్లికన్స్ ఎన్నికలకు ముందే 100 కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంలోనూ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో ఫలితాలను ఎప్పుడు వెల్లడించారు?

2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి. కానీ అమెరికా టీవీ ఛానెల్స్ మాత్రం నవంబర్ 7వ తేదీ ఉదయాన పెన్సిల్వేనియాలో ఫలితం తేలే వరకు వేచిచూశాయి. ఆ తరువాతే జో బైడెన్ గెలుస్తారని ప్రకటించాయి.

2016 లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ సందర్భంలో అమెరికా కాలమానం ప్రకారం ఎన్నికలు ముగిసిన మరునాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫలితం గురించి అమెరికా మీడియా ప్రకటించింది.

ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే భావించాల్సి ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్‌లో నమోదైన ఓట్లను లెక్కించిన తరువాతే తేలుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Update: 2024-11-05 13:35 GMT

Linked news