US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలుస్తారు, భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి? స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

US Elections 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ వైస్ కమలా హారీస్ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది. అసలు ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తారు? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది అనే అంశంలో చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే కోణంలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకునే ఇమ్మిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు అమెరికాకు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుంటాయి. అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ ప్రభావం భారతీయులకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే రాబోయే ప్రెసిడెంట్ ఎవరైతే అమెరికా - భారత్ సంబంధాలు ఎలా ఉంటాయనే అంశంపై భారతీయులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Update: 2024-11-05 07:57 GMT

Linked news