Telangana updates: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్...
*వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సమీక్ష.
*వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
*వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు.
*ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశం.
*గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది, తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం.
*యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం ప్రకటించే అవకాశం.
Update: 2020-10-23 10:33 GMT