Ponnam Prabhakar Comments: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా వ్యవసాయ, రైతు వ్యతిరేక బిల్లులు..పొన్నం ప్రభాకర్..
పొన్నం ప్రభాకర్.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
-కార్పొరేట్లకు అండగా నిలబడేందుకు దేశంలోని రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి పార్లమెంట్ లో రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుంది..
-12 రాజకీయ పార్టీ లు వ్యతిరేకిస్తున్న మూజువాణి ఓటు తో ప్రభుత్వం బిల్లులు ఆమోదింప జేయడం రాజ్యాంగ విరుద్ధం..
-రైతులకు నిజంగా మేలు చేయాలని ఉంటే భూముల పరీక్షలు చేయాలి. నాణ్యమైన విత్తనాలు అందజేయాలి, ఎరువుల ధరలు తగ్గించాలి అలా కాకుండా తన కార్పొరేట్ మిత్రులకు దేశంలోని వ్యవసాయాన్ని అందించాలనే లక్ష్యంతో మోడీ వ్యవసాయ బిల్లులు తెచ్చారు..
-బిల్లుల విషయంలో తన మిత్ర పక్షం కూడా వ్యతిరేకించి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసింది..
-పంజాబ్, హర్యానా లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, రైతుల వ్యతిరేక బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపశరించుకోవాలి..
-క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాం...రైతుల హక్కులను, ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యను కాంగ్రెస్ సమర్థించదు..
-ఎట్టి పరిస్థితులలో బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం.