Nimmala Ramanaidu: నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి:
- నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే
- హామీలిచ్చేటప్పుడు ఆకాశం వైపు చూసి... అమలు చేసేటప్పుడు నేలచూపులా?
- వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
- ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులకు రూ.2వేల సాయం చేశారు.
- తాగునీరు, ఆహారం లేక ముంపుప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారు.
- పాలకుల దృష్టంతా కక్షసాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లపైనే ఉంది.
- గత ఏడాది రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించారు.
- తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్ పాదయాత్రలో ఉండికూడా ప్రజల ముఖం చూడలేదు.
- ఆగస్ట్ 8, 2019న ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి జగన్, ప్రతి వరదబాధిత కుటుంబానికి రూ.5వేలు సాయం చేస్తానని, ఇళ్లుకోల్పోయి, పంటనష్టపోయిన వారిని ఆదుకుంటానని చెప్పాడు.
- నాడు ఆయన చెప్పిన హామీలేవి అమలుకాకుండానే, మళ్లీ వరదలు వచ్చాయి.
- తాజాగా మరలా ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులపై వరాల జల్లు కురిపించి వెళ్లిపోయాడు.
- విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయని వాలంటీర్ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తోంది.
- తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశారో ప్రజలందరూ చూశారు.
- జగన్ లా చంద్రబాబు ఆనాడు రాజప్రాసాదాల్లో కూర్చోలేదు.
- ప్రజల మధ్యనే ఉండి, గంటలవ్యవధిలోనే తుఫాను బాధితులకు నిత్యావసరాలు, పాలు అందించేలా చేశారు.
- కరోనా వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 5సార్లు మాత్రమే బయటకు వచ్చారు.
- జగన్ ధోరణి చూస్తుంటే, కరోనా బాధితుల మాదిరే వరద బాధితులు కూడా వరదతో సహజీవనం చేయాలన్నట్లుగా ఉంది.