National updates: సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి....రఘురామ కృష్ణంరాజు..
జాతీయం..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్
-మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది..
-ప్రజాప్రతినిధులు కూడా రాచరికం పోయింది ప్రజలు ఓటేస్తేనే గెలిచామని గుర్తుంచుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
-వైకాపా లోక్ సభపక్ష నేత మిథున్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. నాపై అనర్హత వేటు వేయాలని మళ్లీ కోరుతామన్నారు
-రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా?
-రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? ఏం సాధించింది?
-నీటి పారుదల శాఖ, రోడ్ల నిర్మాణంలో బీభత్సమైన అవినీతి జరుగుతుంది
-లోక్ సభపక్షనేతకు ఎన్నిక పెడితే మిథున్ రెడ్డికి మూడు ఓట్లకు మించి రావు.
-మిథున్ రెడ్డి పై చాలా మంది ఎంపీలకు అసంతృప్తి ఉంది.
-నాలాగే చాలా మంది ఎంపీలపై వివక్ష ఉంది. కాకపోతే వారు బయటపడటం లేదు
-నన్ను పార్టీ నుంచి బహిష్కరించినా.. నేను పార్లమెంట్ లో కమిటీ చైర్మన్ గా కొనసాగుతాను.
-సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి. కమిటీ చైర్మన్ గా కొనసాగుతా.
-వారికి కావలసిన వారు లోక్సభలో కూర్చునేలా ప్రజా సమస్యలపై మాట్లాడే నాలాంటి వారిని మాత్రం దూరంగా రాజ్యసభ గ్యాలరీ లో కూర్చునేలా ఏర్పాట్లు చేయడం తగదు.
--రఘురామకృష్ణంరాజు, వైకాపా ఎంపీ