Nara Lokesh: ఏలేరు వరద ముంపులో ఉన్న ఈబిసి కాలనీ వాసులను పరామర్శించిన నారా లోకేష్.

తూర్పుగోదావరి :

-గొల్లప్రోలు ఈబిసి కాలనీకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

నారా లోకేష్ కామెంట్స్..

-అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను ఎగతాళి చేస్తున్నారు..

-అధికారం లేదని అవహేళన చేస్తున్నారు.. నాకు మీ లాగా అహంకారం లేదు..

-రాష్ట్రంలో మూడు నెలలుగా వరద ఉంది.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు..

-జిల్లాలో 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది..

-రైతులను అపహాస్యం చేసి అవమానిస్తున్నారు.. వారు పండించేది తింటూ తిడుతున్నారు..

-ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు..

-వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో 64 మంది రైతుతు మృతి చెందారు.

-కౌలు రైతులందరికి రైతు భరోసా అన్నారు.. 15 లక్షల మంది ఉండగా కేవలం 54 వేల మందికి మాత్రమే ఇచ్చారు..

-రైతులకు కులాన్ని ఆపాదించారు.. అగ్ర వర్ణాల రైతులకు ఏ పధకం వర్తించడం లేదు..

-జగన్ రెడ్డి గారు ఆకాశం విహరించడం మానుకుని భూమి పైకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోండి..

-ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తుంటే మమ్మల్ని తిడుతున్నారు..

-వరద వస్తుందనఅ తెలిసినా స్పందించ లేదు.. ఫలితంగా ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..

-ప్రధాని మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితి పై ఆరా తీసే వరకు సిఎం స్పందించకపోవడం దారుణం..

-జనవరి నుంచి 25 లక్షల రూపాయిలు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం చెల్లించారు..

-రైతుల శాపం మంచిది కాదు జగన్ రెడ్డి.. ఇప్పటికైనా మేలుకోవాలి..ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పడు 5 వందలు ఇస్తామంటున్నారు..

-మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోం.. రైతుల పక్షాన టిడిపి పోరాటం చేస్తుంది..

-మా ప్రభుత్వంలో శుధ్ధగడ్డ వాగు ఆధుకనీకరణకు నిధులు ఇస్తే రివర్స్ టెండరింగ్, యు టర్న్ అని నిధులు నిలిపివేసి నిండా ముంచారు..

-మా ప్రభుత్వం లో పోలవరం పనులు 70 శాతం పూర్తయితే ఇప్పుడే కేవలం 2 శాతమే పూర్తయ్యాయి..

Update: 2020-10-19 09:47 GMT

Linked news