Hyderabad Updates: ఎలక్ర్టిక్ వెహికిల్ పాలసీని ఐటీ, మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్ కలిసి విడుదల చేశారు...
// హైదరాబాద్
// రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి విడుదల చేశారు.
// జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు.
// 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు.
// ఐదు కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు.
// ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు...