Godavari Updates: నిలకడగా వరద గోదావరి

తూర్పుగోదావరి -రాజమండ్రి: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గత 4 గంటలు గా నిలకడగా వరద గోదావరి నీటిమట్టం

18.50 అడుగుల నీటిమట్టం వద్ద మూడో ప్రమాద స్థాయి దాటి కొనసాగుతున్న ప్రవాహం

ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 20లక్షల 27వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల

రాజమండ్రి- గోదావరి ఎగువన భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం నుంచి 13 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో

పోలవరం కాఫర్ డ్యాం ఎగువ 30.21 మీటర్ల వరద నీటిమట్టం

82 గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే...

ఏజన్సీ దేవీపట్నం ,చింతూరు,ఎటపాక, విఆర్ పురం, సీతానగరం, కడియం , ఆలమూరు, కొత్తపేట , రావులపాలెం ,ఆత్రేయపురం , కపిలేశ్వరపురం, కె.గంగవరం , పి,గన్నవరం , మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు ,మలికిపురం, అయినవిల్లి, అల్లవరం , ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన , తాళ్ళరేవు మండలాల్లో పలు గ్రామాలలో ముంపు

దేవీపట్నం పూర్తిగా జలదిగ్భంధం..

Update: 2020-08-22 07:22 GMT

Linked news