East Godavari: కాపర్ డ్యాం వద్ద సుడులు తిరుగుతోన్న గోదావరి..

తూర్పుగోదావరి :

- భద్రాచలం నుంచి వస్తున్న వరద నీటితో కాపర్ డ్యాం వద్ద సుడులు తిరుగుతోన్న గోదావరి..

- 30.14 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం..

- ఇబ్యాక్ వాటర్ రూపంలో దేవీపట్నం మండలాన్ని మరోసారి ముంచెత్తిన వరద గోదావరి..

- గత తొమ్మిది రోజులు గా జలదిగ్బంధంలో ఉన్న దేవీపట్నం మండలం లోని 36 ముంపు గ్రామాలు..

- జలదిగ్బంధంలో దేవీపట్నం, పోశమ్మ గండి, పూడిపల్లి, తొయ్యేరు, అగ్రహారం, మంటూరు, పెనికెలపాడు, తున్నూరు, కచ్చులూరు, కొండమొదలు, సహా 36 గ్రామాలు.

- తొమ్మిది రోజులుగా తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులు..

- పునరావాస కేంద్రం లో తప్ప గ్రామాలకు అందని వరద సహాయం, పునరావాస కార్యక్రమాలు..

- కచ్చులూరు కొండపై నుంచి వెలగపల్లి చేరుకుని నిత్యావసరాల కోసం అక్కడి రంపచోడవరం వెళ్తోన్న వరద ముంపు బాధితులు..

- గత 9 రోజులుగా అంధకారంలో 36 ముంపు గ్రామాలు.

- కనీసం కొవ్వొత్తులు, కిరోసిన్ అయినా సరఫరా చేయాలని అధికారులను కోరుతున్న వరద బాధితులు.. పట్టించుకోని స్థానిక అధికారులు.

- దేవీపట్నం మం. లో సెక్షన్ 144 విధించిన రంపచోడవరం ఐటిడిఏ పి ఓ ప్రవీణ్ ఆదిత్య..

- బయట వ్యక్తులు ఎవరూ ముంపు గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేదని హెచ్చరిక..

- దేవీపట్నం మండలం లో వరద కవరేజీ విషయంలో మీడియా పైన ఆంక్షలు విధించిన ఐటిడిఏ పిఓ..

Update: 2020-08-22 04:48 GMT

Linked news