మహబూబాబాద్ జిల్లా.దీక్షిత్ రెడ్డి కిడ్నప్,... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మహబూబాబాద్ జిల్లా.

దీక్షిత్ రెడ్డి కిడ్నప్, హత్యోదంతం కేసులో బయటపడుతున్న అనేక కోణాలు.

నిందితుడు మంద సాగర్ కు ఉన్న నేర చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం.

నిందితుడి బావలు ఇద్దరు పోలీసు శాఖలో కానిస్టేబుల్స్ గా ఉన్నారు.

వారికంటే తానే ఎక్కవగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతోనే కిడ్నప్ పధకరచన చేసిన నిందితుడు సాగర్.

గతంలో 6 ఏళ్ల పాటు స్థానిక పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్ గా పనిచేసిన సాగర్.

బాలుడు దీక్షిత్ తండ్రి రంజిత్ వద్ద డబ్బులు ఉన్నాయని అతన్ని ఎంచుకున్న నిందితుడు.

సాగర్ చదివింది 7వ తరగతి మాత్రమే.... టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకున్న నిందితుడు.

గతంలో ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకొని కాల్స్ ద్వారా ఒక యువతిని వేధించిన సాగర్.

అప్పుడు కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న సాగర్, ఇంకా పెండింగులోనే ఉన్న ఆ వేధింపుల కేసు.

తాజా ఘటనతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సాగర్ అరాచకాలు.

Update: 2020-10-23 04:29 GMT

Linked news