రాజధాని తరలింపు వ్యాజ్యాలలో... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలుకు నిర్ణయం


రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన వేల మంది రైతులకు అన్యాయం జరగకూడదు.



ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.


రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది.


ఈ రోజు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్,పార్టీ ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్ , టి.శివశంకర్, బొలిశెట్టి సత్య పాల్గున్నారు.


వారి అభిప్రాయాలను తెలుసుకున్నా పవన్ కళ్యాణ్


పవన్ కల్యాణ్


“రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోంది.


ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారు.


తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోంది.


అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు.


మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు.


పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నాం.


ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.


వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం.


గౌరవ హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తాం.


ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతాం.


ఈ రోజు పార్టీ ముఖ్యుల అభిప్రాయాలూ తెలుసుకున్నాం.


న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో గడువులోగా కౌంటర్ వేస్తాం”


Update: 2020-08-29 10:48 GMT

Linked news